![]() |
![]() |

పాత సినిమాల టైటిల్స్.. కొత్త చిత్రాలకి శీర్షికలు కావడం అన్నది తెలుగునాట అనాదిగా ఉన్న వ్యవహారమే. రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ ట్రెండ్ మరింత ఊపు అందుకుంది. మరీముఖ్యంగా.. గత కొన్నేళ్ళలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు పాత చిత్రాల తాలుకూ టైటిల్స్ పునరావృతం అయ్యాయి. `గ్యాంగ్ లీడర్`, `ఖైదీ`, `మాస్టర్`, `రాజా విక్రమార్క`.. వంటి టైటిల్స్ ఇందుకు నిదర్శనం.
ఇదిలా ఉంటే, ఇప్పుడిప్పుడే చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల తాలుకూ టైటిల్స్ కూడా `రిపీట్` బాట పడుతున్నాయి. ఆ మధ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. పవన్ కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన `తొలిప్రేమ` (1998) టైటిల్ తో 2018లో ఓ సినిమా చేయగా అది కాస్త మంచి ఫలితాన్నే ఇచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడీ బాటలోనే మరో యంగ్ హీరో పవన్ టైటిల్ ని రిపీట్ చేసే పనిలో పడ్డాడు. ఆ హీరో మరెవరో కాదు.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. 2001లో సంచలనం సృష్టించిన పవన్ `ఖుషి` టైటిల్ తో ప్రస్తుతం విజయ్ ఓ మూవీ చేస్తున్నాడు. సమంత కథానాయికగా శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ సంవత్సరం క్రిస్మస్ కి దక్షిణాది భాషలన్నింటిలోనూ రిలీజ్ కానుంది. మరి.. `తొలిప్రేమ`లాగే `ఖుషి` కూడా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
![]() |
![]() |