Home  »  News  »  ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ కమల్ హాసన్.. ఆయన తర్వాతే ఎవరైనా!

Updated : Jun 1, 2022

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధానపాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించగా సూర్య గెస్ట్ రోల్ లో మెరవనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో నితిన్ కుటుంబానికి చెందిన శ్రేష్ఠ్ మూవీస్ ఈ సినిమాని తెలుగులో భారీగా విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ కమల్ హాసన్ అంటూ ప్రశంసించారు.

వెంకటేష్ మాట్లాడుతూ.. "కమల్ గారి నటనకు 60 ఏళ్ళు. 'పదహారేళ్ళ వయసు' సినిమా తమిళ వెర్షన్ ఆయన ఎర్లీ కెరీర్ లో నటించారు. ఆ సినిమాలో ఆయన నటన చూసి నేను క్లీన్ బౌల్డ్. 'దశావతారం' లాంటి సినిమా చేయడానికి ఎవరికీ గట్స్ సరిపోవు. ఆయన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. నటనలో ఆయనకు ఎవరూ సాటిరారు. ఆయన గ్లోబల్ స్టార్. విశ్వనాథ్, బాలచందర్ వంటి వారి నుంచి అప్ కమింగ్ డైరెక్టర్స్ వరకు అందరూ ఆయనతో సినిమా చేయాలనుకుంటారు. సౌత్ సినిమాని కమల్ కి ముందు, కమల్ తర్వాత అని వర్ణించవచ్చు. ఆయన వచ్చిన తర్వాత టెక్నిషియన్స్, రైటర్స్ ఇలా అందరి ఆలోచన మారింది. ఆయనకు నేను ఫ్యాన్ ని. నేను సెంటిమెంట్ సినిమాలు చేసేముందు ఎన్నోసార్లు ఆయన సినిమాలు చూశాను. ఆయన ఎక్స్ ప్రెషన్సే నావి" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.