![]() |
![]() |
.jpg)
ఒక దశలో `పెళ్ళికాని ప్రసాద్` తరహా పాత్రలకు చిరునామాగా నిలిచేవారు విక్టరీ వెంకటేశ్. ఆ మధ్య `బాబు బంగారం`, `గురు` చిత్రాల్లోనూ.. ప్రీవియస్ మూవీ `వెంకిమామ`లోనూ ముదురు బ్రహ్మచారిగానే దర్శనమిచ్చారు ఈ వెటరన్ స్టార్. అయితే, ఈ ఏడాది తన నుంచి రానున్న మూడు సినిమాల్లోనూ ఇందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు వెంకీ. ఈ చిత్ర త్రయాల్లో పెళ్ళయిన వాడిగానే కనిపిస్తారాయన.
ఆ వివరాల్లోకి వెళితే.. 2021లో `నారప్ప`, `దృశ్యం 2`, `ఎఫ్ 3`.. ఇలా తక్కువ గ్యాప్ లోనే మూడు చిత్రాలతో సందడి చేయనున్నారు వెంకటేశ్. ఈ మూడు చిత్రాల్లోనూ తనవి `ఫ్యామిలీ మ్యాన్` తరహా పాత్రలే. `నారప్ప`లో ముగ్గురు బిడ్డల తండ్రిగా, `దృశ్యం 2`లో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలకి నాన్నగా నటిస్తున్న వెంకీ.. `ఎఫ్ 3`లోనూ పెళ్ళయిన వ్యక్తిగా యాక్ట్ చేస్తున్నారు. మొత్తమ్మీద.. వెంకీ క్రమంగా బ్రహ్మచారి వేషాలకు గుడ్ బై చెప్పి `ఫ్యామిలీ మ్యాన్` రోల్స్ కి కంప్లీట్ గా షిప్ట్ అవుతున్నట్లే కనిపిస్తున్నారు.
కాగా, `నారప్ప` మే 14న విడుదల కానుండగా.. `దృశ్యం 2` జూన్ లేదా జూలైలో రిలీజయ్యే అవకాశముంది. ఇక `ఎఫ్ 3` ఇప్పటికే ఆగస్టు 27కి షెడ్యూల్ అయి ఉంది.
![]() |
![]() |