![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం `హరి హర వీరమల్లు`. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పిరియడ్ డ్రామా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. గురువారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ గ్లిమ్స్ లో నెవర్ సీన్ బిఫోర్ లుక్ లో పవన్ మెస్మరైజ్ చేశారు.
ఇదిలా ఉంటే.. `హరి హర వీరమల్లు`లో పవన్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండెజ్ దర్శనమివ్వనుంది. ఆమె ఓ యువరాణి పాత్రలో కనిపిస్తుందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు సోదరి పాత్రలో జాక్వలైన్ నటిస్తోందట. తన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే జాక్వలైన్ ఎంట్రీపై, రోల్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
కాగా, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ నటిస్తున్న ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న `హరి హర వీరమల్లు` 2022 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |