![]() |
![]() |

ప్రీవియస్ మూవీ `మాస్టర్`తో మరో సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్. ఒకవైపు ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త సినిమాకి సన్నద్ధమవుతున్నాడు. `కొలమావు కోకిల` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటించనుందని సమాచారం. అంతేకాదు.. రూ. రెండున్నర కోట్ల పారితోషికం అందుకోనుందని కథనాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజయ్ నెవర్ సీన్ బిపోర్ రోల్ లో కనిపించబోతున్నాడట. తమిళ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. కాన్ ఆర్టిస్ట్ గా తన పాత్ర ఉంటుందని.. ఇందుకోసం విజయ్ సరికొత్త లుక్ ని ట్రై చేస్తున్నాడని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనుంది.
![]() |
![]() |