![]() |
![]() |

`జెర్సీ` (2019) చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగేసింది శ్రద్ధా శ్రీనాథ్. మొదటి ప్రయత్నంలోనే మూడు కోణాలున్న పాత్రలో ఒదిగిపోయి.. నటిగా ఇంప్రెస్ చేసిసింది. ఆ తరువాత ఆమె నాయికగా నటించిన `జోడి` ఆశించిన విజయం సాధించకపోయినా.. ఇటీవల ఓటీటీలో విడుదలైన `కృష్ణ అండ్ హిజ్ లీల` చిత్రం మరోసారి తనకు నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే.. శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేసిందట. ఇదో ఫిమేల్ సెంట్రిక్ సెటైరికల్ డ్రామా అని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాని `ఆనందో
బ్రహ్మ`, `యాత్ర` చిత్రాల దర్శకుడు మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేయబోతున్నారని తెలిసింది. అంతేకాదు.. `సిద్ధా.. లోకం ఎలా ఉంది నాయనా?` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ ప్రాజెక్ట్ కి ఫిక్స్ చేశారని బజ్.
త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాని ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
మరి.. కన్నడ చిత్రం `యూ టర్న్` తరువాత తనే మెయిన్ లీడ్ గా శ్రద్ధ చేయనున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ.. తనకి ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |