![]() |
![]() |

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ రోల్స్ లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. 'పిట్టగోడ' ఫేమ్ అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ని స్వప్న సినిమా పతాకంపై 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. మహాశివరాత్రి కానుకగా గురువారం థియేటర్స్ లోకి వచ్చిన 'జాతిరత్నాలు'కి విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ళు కూడా బాగున్నాయి.
ఇదిలా ఉంటే.. 'జాతిరత్నాలు' ఓటీటీ లో స్ట్రీమ్ అవడానికి డేట్ ఫిక్సయిందని టాక్. దిగ్గజ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని ఏప్రిల్ తొలి వారంలో స్ట్రీమ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని వినికిడి. త్వరలోనే 'జాతిరత్నాలు' ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.
ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటించగా.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, కీర్తి సురేశ్ అతిథి పాత్రల్లో మెరిశారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ రధన్ బాణీలు సమకూర్చారు.
![]() |
![]() |