![]() |
![]() |

మెగా కుటుంబంలో మరో వారసుడు అడుగు పెట్టాడు. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్త తెలిసి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. లావణ్య ప్రెగ్నెంట్ అయినట్లుగా ఈ ఏడాది మేలో వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 9న ఆ దంపతులకు మెగా బిడ్డ జన్మించాడు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో లావణ్య బిడ్డకు జన్మనివ్వగా.. ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. హైదరాబాద్ లో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ షూటింగ్ లో ఉన్న చిరంజీవి కూడా హాస్పిటల్ కి వెళ్లి.. మనవడిని ఎత్తుకొని మురిసిపోయారు.

![]() |
![]() |