![]() |
![]() |

సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. సినిమాని ఎంతలా ప్రమోట్ చేస్తే.. అంతలా ప్రేక్షకుల్లోకి వెళ్లి, మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే ఎక్కువమంది తమ సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అయితే 'మిరాయ్' టీమ్ మాత్రం.. తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడమే కాకుండా.. 'ఓజీ' సినిమాని కూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. (Mirai)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ', సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా 'ఓజీ' పేరే మారుమోగిపోతోంది. ప్రీ సేల్స్ పరంగా ఓవర్సీస్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అందుకేనేమో, విడుదలకు ఇంకా రెండు వారాలే ఉన్నా.. మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ లో జోరు పెంచడంలేదు. అయితే అనూహ్యంగా 'ఓజీ' ప్రమోషన్ బాధ్యతను 'మిరాయ్' టీమ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. (They Call Him OG)
తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మూవీ 'మిరాయ్'. సెప్టెంబర్ 12న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. టీమ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొద్దిరోజులుగా భారీస్థాయిలో ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే వారికి తెలిసో తెలియకుండానే 'ఓజీ'ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పలు సందర్భాల్లో 'ఓజీ'ని ప్రస్తావించారు. ఇటీవల ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ 'ఓజీ' ప్రస్తావన వచ్చింది. వేదికపై తేజ సజ్జా, మంచు మనోజ్.. ఓజీ గురించి గొప్పగా మాట్లాడారు. అందరిలాగే తాము కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నామని, ఘన విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఓజీ సినిమాని మిరాయ్ టీమ్ ప్రమోట్ చేస్తున్న తీరుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎలాగూ తమ సినిమా మిరాయ్ టీమ్ ప్రమోట్ చేస్తుంది కదా అని.. ఓజీ మేకర్స్ రిలాక్స్ అయినట్టున్నారు అంటూ ఫ్యాన్స్ సరదా కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |