![]() |
![]() |

ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో 'కాంతార'(Kantara)సంచలన విజయాన్ని సాధించడంతో పాటు, సరికొత్త కథ, కథనాల్ని కూడా పరిచయం చేసింది. దీంతో కాంతార సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'కాంతార చాప్టర్ 1'(kantara Chapter 1)పై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే 'రిషబ్ శెట్టి'(Rishab Shetty)చాప్టర్ 1 ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కాంతార కంటే ముందు జరిగిన కథని చాప్టర్ 1 లో చెప్పబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యిందని కూడా చెప్పవచ్చు. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హోంబులే ఫిలిమ్స్ కాంతార ని మించిన భారీ వ్యయంతో నిర్మిస్తుండగా, రుక్మిణి వసంత్(Rukmini Vasanth)హీరోయిన్ గా చేస్తుండటం స్పెషల్ ఎట్రాక్షన్.
ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించిన రిలీజ్ హక్కుల కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా పలు సంస్థలు పోటీపడుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆయా భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగుకి సంబంధించి నైజాం రిలీజ్ హక్కులని మైత్రి(Mythri)డిస్ట్రిబ్యూషన్ వారు సొంతం చేసుకున్నారు. అగ్ర నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన మైత్రి మూవీస్ ఎన్నో భారీ చిత్రాలని నిర్మించి విజయాల్ని అందుకుంటున్నాయి. డిస్ట్రిబ్యూటర్ గాను పలు చిత్రాలని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తు, అంతే విజయాల్ని అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 కి నైజాంలో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అభిమానులని అలరిస్తుందని చెప్పవచ్చు. దసరా కానుకగా అక్టోబర్ 2న 'కాంతార చాప్టర్ 1 'వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
మూవీ ప్రారంభంమయ్యినప్పట్నుంచి ఎంతో మంది నటులు చనిపోతున్నా కూడా రిషబ్ శెట్టి తో పాటు టీం మొత్తం అధైర్య పడకుండా కాంతార చాప్టర్ 1 ని పూర్తి చేసే పనిలో ఉంది. అజనీష్ లోక్ నాధ్ సంగీత దర్శకుడు కాగా త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని ప్రమోషన్స్ లోకి టీం అడుగుపెట్టనుంది.

![]() |
![]() |