![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ పై సినిమాలు పోటీపడటం సహజం. అందులోను అగ్ర హీరోల మధ్య పోటీ ఉండటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ముందుగా అనుకున్న ప్లానింగ్ రివర్స్ అయ్యి, రిలీజ్ డేట్ లు మారిపోయి కూడా పోటీపడాల్సిన పరిస్థితులని చూస్తూనే ఉన్నాం. ఈ కోవలోనే రెండు భారీ ప్రాజెక్ట్ ల మధ్య పోటీ ఏర్పడబోతుందనే న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
రాజమౌళి(Ss Rajamouli),మహేష్ బాబు(Mahesh Babu)కాంబోలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ssmb 29 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే కెన్యా దేశంలో ఒక భారీ షెడ్యూల్ ని చిత్రంలోని ప్రధాన నటీనటులపై రాజమౌళి చిత్రీకరించాడు. పాన్ వరల్డ్ నటి 'ప్రియాంక చోప్రా'(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు పలువురు విదేశీ నటులు, సాంకేతిక నిపుణులు కూడా భాగస్వామ్యం కానున్నారు. దీంతో ssmb 29 పాన్ వరల్డ్ మూవీగా సినీ ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027 వ సంవత్సరంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్(Allu Arjun)స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee Kumar)కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. సమాంతర విశ్వాన్ని అన్వేషించే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది. ఇప్పటికే రిలీజైన మూవీ వర్కింగ్ స్టిల్స్ ని చూస్తుంటే అంచనాలు రెట్టింపయ్యాయి. పలువురు విదేశీ సాంకేతిక నిపుణులు కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. దీపికా పదుకునే(Deepika Padukune)హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం,2027 లోనే విడుదల కానుందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి 2026 డిసెంబర్ లో విడుదల అవుతుందని అందరు అనుకున్నారు. కానీ సిజి వర్క్ కి చాలా టైం పడుతుందని అందుకునే 2027 లోనే రావచ్చనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
పైగా ఈ రెండు చిత్రాలు పాన్ వరల్డ్ స్థాయి సినిమాలు కాబట్టి వేసవి సెలవుల టైంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కూడా అంటున్నారు.మరి ఈ రెండు చిత్రాలు వేసవి సెలవుల్లోనే వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వార్ తప్పేలా లేదు. ఇంచు మించు రెండు చిత్రాలు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా టాక్.
.webp)
![]() |
![]() |