![]() |
![]() |

తన ప్రీవియస్ మూవీస్ `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు కూడా 2019లోనే రిలీజయ్యాయి. కరోనా, ఇతరత్రా కారణాల వల్ల.. 2020, 2021 క్యాలెండర్ ఇయర్స్ కాస్త వరుణ్ కి `జీరో రిలీజ్ ఇయర్స్`గా నిలిచిపోయాయి. దీంతో.. అతని కొత్త చిత్రాలు తక్కువ గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి నెలకొని ఉంది.
Also Read: వేసవిలో `కేజీఎఫ్` భామ హవా!
ఆ వివరాల్లోకి వెళితే.. తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా `గని`. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ సినిమా కోసం బాక్సర్ అవతారమెత్తాడు వరుణ్. కాగా, పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఏప్రిల్ 8న `గని` థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక `గని`లాగే వాయిదాలు పడుతూ వస్తున్న హిలేరియస్ ఎంటర్టైనర్ `ఎఫ్ 3`.. మే 27న సిల్వర్ స్క్రీన్ పై వినోదాలు పంచనుంది. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ తో కలిసి వరుణ్ నటించిన ఈ మల్టిస్టారర్ ని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. మరి.. వరుస నెలల్లో (ఏప్రిల్, మే) రాబోతున్న ఈ రెండు చిత్రాలతో వరుణ్ తేజ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |