![]() |
![]() |

2022 సెప్టెంబర్ 30.. సినీ ప్రియులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ రోజు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. అందులో ఒకటి పాన్ - ఇండియా మూవీ కాగా, మరొకటి హిందీ సినిమా, ఇంకొకటి తెలుగు చిత్రం.
ఆ వివరాల్లోకి వెళితే.. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్ వంటి భారీ తారాగణంతో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఎపిక్ హిస్టారికల్ ఫిక్షన్ `పొన్నియన్ సెల్వన్`. స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం `పి.ఎస్ః 1`.. సెప్టెంబర్ 30న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
కాగా, అదే రోజున హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో పుష్కర్ - గాయత్రి రూపొందిస్తున్న `విక్రమ్ వేద` తెరపైకి రానుంది. 2017 నాటి తమిళ చిత్రం `విక్రమ్ వేద`కి ఇది రీమేక్ వెర్షన్. అలాగే అదే సెప్టెంబర్ 30న రవితేజ టైటిల్ రోల్ లో నటిస్తున్న తెలుగు సినిమా `రావణాసుర` కూడా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. `స్వామి రా రా` ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి కెప్టెన్. మరి.. 2022 దసరా సీజన్ లో ఒకే తేదిన (సెప్టెంబర్ 30) రాబోతున్న ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో వేటికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |