
`కేజీఎఫ్` చిత్రంతో డ్రీమ్ డెబ్యూ ఇచ్చింది కథానాయిక శ్రీనిధి శెట్టి. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సదరు పాన్ - ఇండియా మూవీలో రీనా దేశాయ్ గా తన అందచందాలతో కవ్వించింది శ్రీనిధి. అలాగే, మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మంగళూరు సుందరి.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది వేసవి శ్రీనిధి శెట్టికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ సమ్మర్ లో ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తెరపైకి రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`, `కోబ్రా`. `కేజీఎఫ్`కి సెకండ్ పార్ట్ గా రూపొందిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` వేసవి కానుకగా ఏప్రిల్ 14న పలు భాషల్లో ఎంటర్టైన్ చేయనుంది. ఇక `కోబ్రా` విషయానికి వస్తే ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాని మే 26న రిలీజ్ చేయబోతున్నారు. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ రెండు చిత్రాలతో శ్రీనిధి స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
కాగా, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో రాకింగ్ స్టార్ యశ్ కి జోడీగా మరోసారి కనువిందు చేయనున్న శ్రీనిధి శెట్టి.. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన `కోబ్రా`లో సీనియర్ స్టార్ `చియాన్` విక్రమ్ కి జంటగా దర్శనమివ్వనుంది.




.webp)

