![]() |
![]() |

`నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగీ`, `చిత్రలహరి`, `రెడ్`.. ఇలా వరుస నాన్ - ఫెయిల్యూర్స్ తో ముందుకు సాగుతున్న దర్శకుడు కిశోర్ తిరుమల నుంచి రాబోతున్న తాజా చిత్రం `ఆడవాళ్ళు.. మీకు జోహార్లు!`. శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రాధిక, ఖుష్బూ, ఊర్వశి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపు (మార్చి 4) థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే, `ఆడవాళ్ళు మీకు జోహార్లు` రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 141 నిమిషాల (2 గంటల 21 నిమిషాల) నిడివితో ఈ సినిమా ఎంటర్టైనర్ చేయనుందట. ఒకరకంగా.. ఈ క్రిస్పీ రన్ టైమ్ సినిమాకి అనుకూలించే అంశమనే చెప్పాలి. మరి.. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని క్రిస్పీ రన్ టైమ్ తో వస్తున్న `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.. బాక్సాఫీస్ ముంగిట విజేతగా నిలుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |