![]() |
![]() |

ఇటీవల 'ఖిలాడి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మాస్ మహారాజ రవితేజ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో 'ధమాకా'తో దుమ్మురేపటానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. ప్రస్తుతం వీటి చిత్రీకరణ జరుగుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజపై తెరకెక్కిస్తున్న యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఈ షూటింగ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ అద్వర్యంలో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

ఈ సినిమాకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించాడు. గతంలో త్రినాథరావు, ప్రసన్న కాంబినేషన్ లో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలు హిట్ అయ్యాయి. 'ధమాకా'లో కూడా యాక్షన్ తో పాటు ఈ సినిమాల్లోలాగ కామెడీ ఉంటుందట.
![]() |
![]() |