![]() |
![]() |

'భీమ్లా నాయక్' మూవీపై మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. తమన్ స్వరపరిచిన సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. 'భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్' తో పాటు 'లాలా భీమ్లా' సాంగ్ ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే 'అంత ఇష్టం' సాంగ్ కూడా విశేష ఆదరణ పొందింది. కానీ ఈ సాంగ్ ని సినిమా నుంచి తొలగించడం ఆశ్చర్యపరిచింది.
తమన్ స్వరపరిచిన 'అంత ఇష్టం' సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. 'అంత ఇష్టం ఏందయ్యా నీకు' అంటూ సాగే ఈ ఫీల్ గుడ్ మెలోడీని కె.ఎస్.చిత్ర ఎంతో అందంగా ఆలపించారు. గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ సాంగ్ లిరికల్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అంతలా ఆదరణ పొందిన ఈ సాంగ్ సినిమాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

'భీమ్లా నాయక్'లో అడవి సంపద స్మగ్లింగ్ కేసులో నిత్యని ఇరికించి జైలుకి పంపించాలని డేనియల్ ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంది. దీంతో ఆమెని పవన్ అడవిలోని తండాకు తీసుకెళ్తాడు. అక్కడ వీరి మధ్య ప్రేమతో కూడిన సరదా సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో 'అంత ఇష్టం' సాంగ్ రావాల్సి ఉంది. కానీ ఆ సాంగ్ ని ఎందుకనో తొలగించారు. మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఉన్న ఈ సినిమాలో ఆ మెలోడీ సాంగ్ ఎందుకని తొలగించినట్లున్నారు. అయితే కొద్దిరోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సూపర్ హిట్ సాంగ్ ని యాడ్ చేసే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |