![]() |
![]() |

జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు అంటే కేవలం నెల రోజుల వ్యవధిలో మూడు పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయా? అవునన్నదే టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. జూలై 16న కేజీఎఫ్ ఛాప్టర్ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సెన్సేషన్ కేజీఎఫ్ ఛాప్టర్ 1కి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రధానంగా కన్నడంలో తెరకెక్కినా జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కట్ చేస్తే.. ఆగస్టు 13న మరో పాన్ ఇండియా మూవీ రాబోతోంది. అదే.. పుష్ప. రంగస్థలం తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, అల వైకుంఠపురములో అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే పాన్ ఇండియా లీగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు బన్నీ, సుక్కు.
ఇక ఈ రెండు సినిమాల నడుమ మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ రాబోతోందట. అదే.. రాధేశ్యామ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాని తొలుత వేసవిలో విడుదల చేయాలనుకున్నా.. కొన్ని కారణాల వల్ల జూలైకి వాయిదా పడిందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. జూలై 30న రాధేశ్యామ్ తెరపైకి వచ్చే అవకాశముందంటున్నారు.
దీంతో.. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు రెండు వారాలకో పాన్ ఇండియా మూవీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నట్లవుతోంది. త్వరలోనే రాధేశ్యామ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |