![]() |
![]() |

ఉప్పెన చిత్రంతో తెలుగునాట కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది కృతి శెట్టి. వేలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ చిత్రం విడుదలకు ముందే.. నేచురల్ స్టార్ నానికి జోడీగా శ్యామ్ సింగ రాయ్ లో ఓ నాయికగా నటించే అవకాశం అందిపుచ్చుకుంది కృతి. అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ - సుధీర్ బాబు థర్డ్ జాయింట్ వెంచర్ లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేయనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని బుల్లోడు అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ నాయికగా సాక్షి వైద్య ఎంపిక కాగా.. మరో హీరోయిన్ గా కృతి శెట్టి పేరు వినిపిస్తోంది. త్వరలోనే అఖిల్ 5లో కృతి శెట్టి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ జూన్ 19న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |