![]() |
![]() |

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'అగ్లీ స్టోరీ' (Ugly Story). ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు చాలా గ్రిప్పింగ్‌గా సాగింది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది ఒక సాదాసీదా ప్రేమకథ కాదని, దీని వెనుక ఏదో 'అగ్లీ' కోణం ఉందనే విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు.
ఇందులో నందు, అవికా గోర్ భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు. వేరొకరిని ప్రేమించిన అవికా.. అయిష్టంగానే నందుని పెళ్లి చేసుకుంటుంది. నందు మాత్రం అవికాను పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందటం కోసం సైకోలా బిహేవ్ చేస్తుంటాడు.
"ప్రతి నిమిషం ప్రేమించే పోటుగాడు ఎవడూ లేడు.. ఒక్క నేను తప్ప", "ఇష్టం లేనోడితో కూడా మంచంలో పడుకునేలా చేసే ఇది(తాళి) అంటే నాకు ఎంత ఇష్టమో", "ప్రేమించిన వాళ్ళని ఎలాగైనా దక్కించుకోవడమే నాకు తెలిసిన ప్రేమ" అంటూ నందు చెప్పే డైలాగ్ లు ఆ పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది.
నందు తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. అవికా గోర్ పాత్ర కూడా చాలా బలంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి.
దర్శకుడు ప్రణవ స్వరూప్ ఎంచుకున్న కథాంశం, దానిని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. శ్రవణ్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ కూడా డార్క్‌గా, సినిమా థీమ్‌కు తగ్గట్టుగా ఉంది.
మొత్తానికి 'అగ్లీ స్టోరీ' ట్రైలర్ ఒక ఇంప్రెసివ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అయ్యే అవకాశం ఉంది. మే 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ 'అగ్లీ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |