Home  »  News  »  Tollywood trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్

Updated : May 6, 2026

 

ఎండలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ సినీ తాజా న్యూస్ మాత్రం ఎప్పడు ఈ ముందు ఉంటాయి అనే రీతిలో ఎక్స్ క్లూజివ్ తెలుగు సినిమా న్యూస్ తమ సినీ పరిమళాల్ని మీ ముందు ఉంచాయి. అవేంటో చూద్దాం.


1. డ్రాగన్ కి జాయిన్ అయిన సంచలన దర్శకుడు దేవ కట్టా    

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంచలన దర్శకుడు దేవకట్టా  డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ కి దేవకట్టా పెట్టింది పేరు. కమర్షియల్ ఫ్లేవర్ ఉంటూనే సూటిగా, సుతిమెత్తగా, సమాజంలోని అన్ని వర్గాలకి చేరువయ్యేలా  దేవకట్టా డైలాగ్స్ ఉంటాయి. 'ప్రస్థానం', 'ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. అందుకే దేవకట్టాని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. మహేష్, రాజమౌళి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసి కూడా  దేవకట్టా  డైలాగ్స్ అందిస్తున్న  విషయం తెలిసిందే .


2. రజినీ, కమల్ బడ్జెట్ వైరల్ 

ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ఖరీదైన మూవీ ఏదంటే రజినీ, కమల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. పైగా  47 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనుండంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.ఇప్పుడు ఈ చిత్రం బడ్జెట్  టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం సుమారు 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంతి ప్రస్తుత ఎంఎల్ ఏ   ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు.  జైలర్ సిరీస్ ఫేమ్  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడనే విషయం తెలిసిందే.

3. పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ 

పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్  బుకింగ్స్ మే 7రాత్రి 8 గంటలకి EST నుంచి  ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత 7 PM CST ,  5 PM PST  షోస్ స్టార్ట్ కానున్నాయి.  EST , CST ,PST  అంటే ఓవర్ సీస్ లో ఉన్న ఏరియాస్. ఈ మేరకు అధికారకంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ తో ప్రకటించారు. రిలీజ్ కి  దాదాపు నెల రోజుల ముందే టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతుండటం విశేషం. దీన్ని బట్టి పెద్ది కోసం ఫ్యాన్స్ ఎంత వెయిటింగ్ తో ఉన్నారో అర్ధమవుతుంది. పెద్ది 
 ఓవర్ సీస్ పంపిణి సంస్థ ప్రత్యంగిర సినిమాస్.

4.జాన్వీకపూర్ పెళ్లి తిరుపతిలో అనే వార్తలపై స్పందించిన బోనీ కపూర్ 

జాన్వీ కపూర్ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతుంది. కొంత ముందైతే తమకి పెళ్లి ఇన్విటేషన్ వచ్చిన వాళ్లల్లా ఆ ఇద్దరి వివాహం తిరుపతిలో జరగబోతుందనే వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తాజాగా ఇచ్చిన  ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ తండ్రి బోనీకపూర్ మాట్లాడుతు జాన్వీ పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే.  జాన్వీ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించింది. పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చాడు.జాన్వీ నెక్స్ట్ మంత్ 4 న పెద్దితో రానున్న విషయం తెలిసిందే.

5. ఎల్లమ్మలో మృణాల్ ఠాకూర్ 

బలగం వేణు, దేవిశ్రీప్రసాద్ కాంబోలో ఎల్లమ్మ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గోల్డెన్ లెగ్ అనే టాగ్ లైన్ తో మృణాల్ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మలో  మృణాల్ ఖాయమైతే కనుక మరింత క్రేజీ ప్రాజెక్ట్ గా మారడం ఖాయం. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఎల్లమ్మని హిట్ చిత్రాల మేకర్ దిల్ రాజు నిర్మిస్తున్న నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

6.లెనిన్ నుంచి రిలీజైన భాగ్యశ్రీ బోర్సే లుక్ వైరల్  

ఈ రోజు మోస్ట్ వాంటెడ్ అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు. ఈ సందర్భంగా అఖిల్ తో తాను చేస్తున్న లెనిన్ నుంచి మేకర్స్  భాగ్యశ్రీ  లుక్ ఒకదాన్ని రిలీజ్ చేసారు. సదరు లుక్ లో ఒక స్టేజ్ నాటకంలో రాజు వేషాన్ని తలపిస్తు భాగ్యశ్రీ ప్రదర్శిస్తున్న ఆహార్యం, గంబీరమైన రూపం ఫ్యాన్స్, నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. లెనిన్ లో  భారతిగా కనిపించనుంది. 

7.సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ క్రేజీ అప్ డేట్.. విలన్ రేసులో ఆ ఇద్దరు 

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో మూవీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే   రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుండగా ప్రతి నాయకుడి క్యారక్టర్ కి మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, ధురంధర్ ఫేమ్ అక్షయ్ ఖన్నాపేర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ పేర్లు వైరల్ కావడంతో ఆ ఇద్దరిలో ఎవరైనా తమకి ఓకే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబోకి దిల్ రాజు నిర్మాత అనే విషయం తెలిసిందే

8.నితిన్ , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్రం స్టార్ట్ 
 
నితిన్, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీ పూజా కార్యక్రమాలతో ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది.  నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నితిన్ ని వరుస పరాజయాల నుంచి విముక్తి కల్పిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నితిన్ సరసన మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా చేస్తుంది. కంటిన్యూ గా షూటింగ్ ని జరుపుకోనుంది.

99.బాలయ్య, కొరటాల శివ మూవీలో బాలీవుడ్ భామ

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైన విషయం తెలిసిందే.  హీరోయిన్ గా బాలీవుడ్ నటి విద్యాబాలన్ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాబాలన్ ఇంతకు ముందే బాలయ్యతో ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో జతగా చేసి మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ ముచ్చటగా మూడోసారి జతకడితే  ఫ్యాన్స్ , ప్రేక్షకులకి అంతకంటే భాగ్యం మరొకటి ఉండదని చెప్పవచ్చు. మరి కొన్ని రోజులు అయితే గాని సదరు న్యూస్ పై ఫుల్ క్లారిటీ రాదు

10. మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి కీలక  ప్రకటన

మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి కీలక  ప్రకటన వచ్చింది. సదరు ప్రకటనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోను కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన సంస్థ  'మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాత్రమే. కానీ కొంతమంది వ్యక్తులు మా పేరుని దుర్వినియోగం చేస్తు  కళాకారుల నుండి చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేయడానికి “AP MAA”, “MAA AP” మరియు ఇతర తప్పుదారి పట్టించే పేర్లని ఉపయోగిస్తున్నారు. వాటికి మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి సంబంధం లేదని సుదీర్ఘ నోట్ రిలీజ్ చేసింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.