![]() |
![]() |
.webp)
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న 'స్పిరిట్' (Spirit) సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్న సమయానికి రాదని, 2027 డిసెంబర్ కి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.
'స్పిరిట్' సినిమా వాయిదా పడిందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తాజాగా మేకర్స్ స్పష్టం చేశారు. ఎలాంటి వాయిదా లేకుండా ముందు నిర్ణయించిన తేదీకే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వాయిదా వార్తలతో కాస్త నిరుత్సాహపడ్డ ప్రభాస్ అభిమానులకు ఈ క్లారిటీ పెద్ద ఊరటనిచ్చింది.
సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారు. భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మే నెల మధ్య నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ప్రస్తుతం ప్రభాస్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్‌లో పాల్గొంటున్నారు.
![]() |
![]() |