![]() |
![]() |

పైకి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అంటారు గాని అంతిమంగా సినిమా కంటే గొప్పది ఉండదనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. అందుకే సినిమా మంచి కోసం కొన్ని కాంబినేషన్స్ కి సంబంధించిన న్యూస్ వస్తుంటే సదరు న్యూస్ నిజమవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కోరిక సల్మాన్ ఖాన్(Salman Khan),వంశీ పైడిపల్లి(Vamsi paidipally)మూవీ గురించి వినపడుతున్న ఇద్దరు లెజండ్రీ నటుల పేర్ల వల్ల.. ఆ డీటెయిల్స్ చూద్దాం
ఫహద్ ఫాజిల్, అక్షయ్ ఖన్నా. ఈ ఇద్దరికి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకర్ని సల్మాన్ కి విలన్ గా దించాలని చిత్ర బృందం బావిస్తుందంట. అదే జరిగితే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వడం పక్కా. ఈ ఇద్దరు తమ విలనిజంతో సినిమా రేంజ్ ని పెంచడంలో సిద్ద హస్తులు. ప్రీవియస్ చిత్రాలు ధురంధర్, పుష్ప సిరీస్ నే ఉదాహరణ. కొంత మంది అభిమానులైతే ఈ ఇద్దరు ఉండేలా వంశీ పైడిపల్లి మైండ్ సెట్ చెయ్యచ్చు కదా అంటున్నారు.
Also read: NBK 112: బాలయ్య, కొరటాల శివ కాంబోలో ఊహించని హీరోయిన్.. మరి నందమూరి ఫ్యాన్స్ ఏమంటారో
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 'శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

![]() |
![]() |