![]() |
![]() |

టాలెంటెడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith) తన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆకర్షణీయమైన పోస్టర్‌ను పంచుకుంటూ, తన కొత్త ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు.
నారా రోహిత్ కెరీర్ లో 23వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చినమిల్లి మణికుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఒక వ్యక్తి మైక్‌లో ఏదో చెప్తున్నట్లు, అలాగే 'లిజన్', 'షౌటింగ్ సూన్' అనే పదాలతో ఆసక్తికరంగా ఉంది. ఇది సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
నారా రోహిత్ తన కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త చిత్రంతో కూడా మరో వైవిధ్యమైన ప్రయోగానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
చివరగా గతేడాది 'సుందరకాండ'తో ప్రేక్షకులను అలరించారు నారా రోహిత్. ఆ తర్వాత చాలా కథలు విన్న ఆయన.. కొత్త దర్శకుడు మణి కుమార్ చెప్పిన కథకు ఫిదా అయ్యి, దీనిని పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
https://x.com/IamRohithNara/status/2051939111997686200
![]() |
![]() |