![]() |
![]() |

అమ్మ ఇందిరా దేవికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు మహేశ్ బాబు. వీల్‌చైర్‌లో కూర్చొని, ఒళ్లో కుక్కపిల్లను పెట్టుకొని ఉన్న అమ్మ ఫొటోను షేర్ చేశాడు మహేశ్. అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఆ ఫొటో వైరల్‌గా మారింది. తల్లిని ఒక ఆశీర్వాదంగా భావించిన మహేశ్, ఎప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉంటానని రాశాడు.
సోషల్ మీడియా ద్వారా ఏప్రిల్ 20న తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు మహేశ్. ఈ ఏడాదీ అందుకు మినహాయింపు కాదు. ఈ ప్రత్యేక సందర్భం కోసం ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె ఫొటోను షేర్ చేసిన అతను, "హ్యాపీ బర్త్‌డే అమ్మా. నువ్వు ఆశీర్వాదంగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఒక్కరోజు అనేది నిజంగా ఎప్పటికీ సరిపోదు! ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అని అతను రాసుకొచ్చాడు.
సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి దంపతుల ఐదుగురు సంతానంలో మహేశ్ నాలుగోవాడు. అతనికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు. ఈమధ్యే అన్నయ్య రమేశ్ బాబు మృతి చెందారు.
పని విషయానికి వస్తే, అతని లేటెస్ట్ ఫిల్మ్ 'సర్కారువారి పాట' మే 12న విడుదలకు రెడీ అవుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడు మహేశ్.

![]() |
![]() |