![]() |
![]() |

నాని, నజ్రియా జంటగా నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికీ'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు మేకర్స్.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న 'అంటే సుందరానికీ' మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. సుందర ప్రసాద్ అనే యువకుడి పాత్రలో నాని కనిపిస్తున్నాడు. గండాలు, ఆచారాలు పేరుతో సుందర్ ని అతని పేరెంట్స్ మరీ సుకుమారంగా పెంచినట్లు టీజర్ లో చూపించారు. నాని తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక హిందూ యువకుడి పాత్రలో కనిపించే నాని.. క్రిస్టియన్ యువతిగా నటించిన నజ్రియాతో ప్రేమలో పడటంతో కథ మరింత ఆసక్తికరంగా మారనుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. టీజర్ చివరిలో 'మీకింకా అసలు విషయం చెప్పలేదు' అని నాని అనడంతో.. అందరూ 'అంటే!' అని షాక్ తో చూడటంతో టీజర్ ముగిసింది. మొత్తానికి 'అంటే సుందరానికీ'తో కాస్త గ్యాప్ తర్వాత నాని ఫుల్ ఎంటర్ టైన్ చేయబోతున్నాడన్నమాట. ఇటీవల 'శ్యామ్ సింగ రాయ్'తో విజయాన్ని అందుకున్న నాని.. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. నరేష్, హర్ష వర్ధన్, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |