Home

»

Latest News

భానుమ‌తి `అంతా మ‌న మంచికే`కి 50 ఏళ్ళు!

Apr 19, 2022 6:02PM

తెలుగునాట బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా గుర్తింపు పొందిన వైనం భానుమ‌తి సొంతం. `చండీరాణి` (1953)తో ద‌ర్శ‌కురాలిగానూ త‌న‌దైన ముద్ర వేసిన భానుమ‌తి.. 19 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం తెర‌కెక్కించిన చిత్రం `అంతా మ‌న మంచికే` (1972). ``స్త్రీ అబ‌ల కాదు.. ప‌ట్టుద‌ల‌తో ఎట్టి ప‌నులైనా సాధించ‌గ‌ల స‌బ‌ల‌!`` అని చాటిచెపుతూ ఈ సినిమాని రూపొందించారు భానుమ‌తి. అలాగే సావిత్రిగా ప్ర‌ధాన పాత్ర పోషించి త‌న‌దైన అభిన‌యంతో మెప్పించారు.  సూప‌ర్ స్టార్ కృష్ణ‌, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, నాగ‌య్య‌, నాగ‌భూష‌ణం, ధూళిపాల‌, ప‌ద్మ‌నాభం, సూర్య‌కాంతం, ఛాయాదేవి, టి. ప‌ద్మిని, రుష్యేంద్ర‌మ‌ణి, బేబి రాణి, సాక్షి రంగారావు, ర‌మాప్ర‌భ‌, లీలా రాణి, జ‌గ్గా రావు ఇందులో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు.

భానుమ‌తి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌త్యం స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి, దాశ‌ర‌థి, ఆరుద్ర సాహిత్యమందించారు. ``నవ్వవే నా చెలి..``, ``నేనే రాధనోయి..``, ``నీవే రా నా మదిలో..``, ``మానస సంచరరే..``, ``మాట చాలదా మనసు చాలదా..`` .. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. భ‌ర‌ణి పిక్చ‌ర్స్ ప‌తాకంపై పి. రామ‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1972 ఏప్రిల్ 19న విడుద‌లైన `అంతా మ‌న మంచికే``.. నేటితో 50 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com