![]() |
![]() |

విజయ్, అజిత్, విక్రమ్, సూర్య.. వీళ్ళందరూ కోలీవుడ్ లో టాప్ స్టార్స్. తెలుగులోనూ మంచి మార్కెట్ ని, ఇమేజ్ ని సొంతం చేసుకున్నవారే. అలాంటి ఈ నలుగురు అగ్ర కథానాయకులు 2022 ఆరంభంలో తమ తమ కొత్త చిత్రాలతో సందడి చేశారు. ఆయా సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగులోనూ అనువాద రూపంలో పలకరించాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ నాలుగు సినిమాలకి కూడా తెలుగునాట ఆశించిన స్పందన రాలేదు. ఆ వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 10న విక్రమ్ నటించిన `మహాన్` చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమ్ కాగా.. మిశ్రమ స్పందన రాబట్టుకుంది. తెలుగులోనూ ఆదరణ అంతంత మాత్రమే. ఇక అదే నెల 24న థియేటర్స్ లోకి వచ్చిన అజిత్ యాక్షన్ థ్రిల్లర్ `వలిమై`.. తమిళనాట ఓకే అనిపించుకోగా, తెలుగులో మాత్రం డిజప్పాయింట్ చేసింది. అలాగే, మార్చి 10న రిలీజైన సూర్య `ఎదర్కుమ్ తుణిందవన్` (ఈటీ) కూడా తెలుగువారిని నిరాశపరిచింది. అదేవిధంగా, ఈ నెల 13న విడుదలైన విజయ్ `బీస్ట్` కూడా సేమ్ ఫీట్ ని రిపీట్ చేసింది. మొత్తమ్మీద.. కోలీవుడ్ టాప్ స్టార్స్ విజయ్, అజిత్, విక్రమ్, సూర్య తెలుగు అభిమానులకి 2022 ఆరంభం నిరాశమయమే అని చెప్పాలి.
![]() |
![]() |