![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా జపం చేస్తుంటే డైరెక్టర్ కొరటాల శివ మాత్రం తాను పాన్ ఇండియా అనే మాటకు దూరమని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమాని పాన్ ఇండియా లెక్కలేసుకొని ప్లాన్ చేయలేదని, అందరూ చూసేలా ఒక బలమైన కథని రాసుకున్నానని తెలిపారు.
'ఆర్ఆర్ఆర్' సినిమాతో తారక్ కి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. కొరటాల డైరెక్షన్ లో తారక్ చేయబోయే నెక్స్ట్ మూవీతో పాటు ఇక నుంచి అతను చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్నాయని అంటున్నారు. అయితే తాజాగా 'ఆచార్య' ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై కొరటాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ దర్శకుడైనా తెలుగు ప్రేక్షకుల కోసమైతే ఓ కథ, పాన్ ఇండియా కోసమైతే మరో కథ రాయరని అన్నారు. తారక్ కోసం చాలా బలమైన కథ రాశానని, అది అందరికీ రీచ్ అవుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, జూన్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని కొరటాల చెప్పుకొచ్చారు. గతంలో తారక్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో వీరి కలయికలో వస్తున్న రెండో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
కాగా కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించడం విశేషం.
![]() |
![]() |