![]() |
![]() |

పాన్ ఇండియా మూవీగా విడుదలైన కన్నడ సినిమా 'కేజీఎఫ్ చాప్టర్-2' వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తూ సంచలన రికార్డులతో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల గ్రాస్ దిశగా పయనిస్తున్న కేజీఎఫ్-2.. తెలుగు రాష్ట్రాల్లోనూ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో 75 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. అయితే కేజీఎఫ్-2 ఎన్ని సంచలనాలు సృష్టించినా.. ఫుల్ రన్ లో ఆంధ్రప్రదేశ్ లోని బయ్యర్లకు కొంతమేర నష్టాలను మిగిల్చే అవకాశముండటం షాకింగ్ గా మారింది. దానికి కారణం ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరగడమే.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి కేజీఎఫ్-2 రికార్డు స్థాయిలో 78 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 75.45 షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ కి చేరువైన ఈ మూవీ.. తెలంగాణలో భారీ ప్రాఫిట్స్ చూస్తుండగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బయ్యర్లకు నష్టాలను మిగల్చనుంది.
నైజాంలో 25 కోట్ల బిజినెస్ చేసిన కేజీఎఫ్-2.. 13రోజుల్లో 39.08 కోట్ల షేర్ రాబట్టి 40 కోట్ల దిశగా పయనిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా నైజాంలో 14-15 కోట్ల ప్రాఫిట్స్ చూసే ఛాన్స్ ఉంది. సీడెడ్ లో 14 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటిదాకా ఈ మూవీ 10.54 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే ఆంధ్రాలో 39 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటిదాకా 25.83 కోట్లు మాత్రమే రికవరీ అయింది.
మొదటి 12 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ కోటికి పైగా షేర్ రాబట్టిన కేజీఎఫ్-2.. 13వ రోజు మాత్రం 94 లక్షలకు పరిమితమైంది. దానికితోడు ఈ 29 న 'ఆచార్య' విడుదలవుతుంది. అంటే ఈ రెండు రోజులు మాత్రమే కేజీఎఫ్-2 కి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత తెలుగు స్టేట్స్ లో కేజీఎఫ్-2 కలెక్షన్స్ పై ఆచార్య ప్రభావం పడనుంది. ఫుల్ రన్ లో తెలుగు స్టేట్స్ లో మరో ఐదు కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశమున్న కేజీఎఫ్-2.. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో బయ్యర్లకు 13 కోట్లకు పైగా నష్టం మిగిల్చే అవకాశముంది అంటున్నారు.
తెలంగాణలో టికెట్ రేట్స్ అధికంగా ఉన్నాయి. దానికితోడు మొదటి నాలుగు రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. డబ్బింగ్ సినిమా కావడంతో ఏపీ ప్రభుత్వం హైక్ కూడా ఇవ్వలేదు. అందుకే తెలంగాణలో భారీ లాభాలను, ఆంధ్రప్రదేశ్ లో నష్టాలను చూస్తుంది కేజీఎఫ్-2.
![]() |
![]() |