![]() |
![]() |
.webp)
ఓమ్ రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' మూవీని పూర్తిచేసిన ప్రభాస్.. 'ప్రాజెక్ట్ కె', 'సలార్' మూవీస్‌తో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో 'ప్రాజెక్ట్ కె' మూవీని చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'సలార్' మూవీని చేస్తాడా లేక మారుతి డైరెక్షన్‌లో నటిస్తాడా అనే సందిగ్ధం నెలకొంది. మారుతి కూడా ప్రభాస్ ఎప్పుడు తన సినిమా సెట్స్ మీదకు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు.
సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి దర్శకత్వంలో నటించవద్దంటూ తమ హీరోకు సూచిస్తూ వస్తున్నారు. దీంతో ఒకానొక టైమ్‌లో ఈ సినిమా ఉండే అవకాశం లేదని కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ అలాంటిదేమీ లేదనీ, ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనీ మారుతి సన్నిహిత వర్గాలు తెలుపుతూ వచ్చాయి. ఇంతదాకా మారుతి ఈ స్థాయి హీరోతో వర్క్ చేయలేదు. పైగా అతనివన్నీ కామెడీ ప్రధానంగా రూపొందిన సినిమాలే. అందుకే ప్రభాస్ లాంటి మాస్ స్టార్‌ను మారుతి హ్యాండిల్ చేయలేడనేది ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయం.
మరోవైపు బౌండ్ స్క్రిప్టుతో ప్రభాస్‌ను డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు మారుతి. ఇప్పటికే అతను గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' మూవీని పూర్తి చేశాడు. జూలై 1న అది రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఏం చేస్తాడో చూడాలి.
![]() |
![]() |