![]() |
![]() |

మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానంటూ నమ్మించి, తనపై పలుసార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం మలయాళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.
ఏప్రిల్ 22న విజయ్ పై కేరళలోని ఎర్నాకులంలో అత్యాచారం కేసు నమోదైంది. తనపై కేసు నమోదైందనే విషయం తెలిసినప్పటి నుంచి విజయ్ పరారీలో ఉన్నాడు. ఓ వైపు ఆయనను విచారించేందుకు పోలీసులు వెతుకుతుంటే.. మరోవైపు ఆయన నిన్న రాత్రి ఫేస్ బుక్ లైవ్ లో ప్రత్యక్షమయ్యాడు. తనపైన తప్పుడు ఆరోపణలు చేసిన ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేస్తానని చెప్పాడు. ఆడిషన్ ద్వారా ఆమె తన సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందని, ఆ సమయంలో తాను ఎప్పుడూ ఆమెతో చాట్ చేయలేదని అన్నాడు. గత ఏడాది చివర్లో ఆమెనే తనకు మెసేజ్ చేయడం ప్రారంభించిందని, ఆ మెసేజ్ లకు సంబంధించిన దాదాపు 400 స్క్రీన్ షాట్‌లను రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
అయితే ఆ నటి మాత్రం ఈ ఏడాది మార్చ్ 13 నుంచి ఏప్రిల్ 14 వరకు విజయ్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. బలవంతంగా మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని, న్యూడ్ వీడియోలు తీసి బెదిరించాడని ఆరోపించింది. అతని ట్రాప్ లో పడి ఎందరో అమ్మాయిలు బలయ్యారని, తనలాగా ఇంకెవ్వరికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే న్యాయ పోరాటానికి దిగానని ఆమె చెప్పుకొచ్చింది.
విజయ్ పై అత్యాచార కేసు నమోదు కావడం మలయాళం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ మహిళ ఏమో విజయ్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తుంటే.. విజయ్ మాత్రం ఆ ఆరోపణల్లో నిజం లేదంటున్నాడు.
![]() |
![]() |