![]() |
![]() |

ఎలా? ఎలా? సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలి? సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాల మదిని తొలిచి వేస్తున్న ప్రశ్న ఇది. ఏప్రిల్ నెలలో ఒక్క రోజు కూడా థియేటర్ల డోర్లు తెరుచుకోలేదు. థియేటర్ల నుండి యాజమాన్యాలకు ఒక్క పైసా ఆదాయం రాలేదు. అయినా... సిబ్బందిని అట్టి పెట్టుకోక తప్పదు. వాచ్ మెన్ దగ్గరనుండి ఒక్కొక్కరిని లెక్కపెట్టుకుంటూ వెళితే... ఒక్కో థియేటర్లో కనీసం పదిమంది వరకు అయినా స్టాఫ్ ఉంటారు. థియేటర్ల మూసివేసినప్పటికీ బయట సెక్యూరిటీని మెయింటైన్ చేయాల్సిందే.
ఇవాళ థియేటర్లలో సిబ్బందికి పనిలేదని తొలగిస్తే... రేపు థియేటర్లు తెరుచుకున్న రోజు నైపుణ్యం కల, పని తెలిసిన సిబ్బంది దొరకడం కష్టం అవుతుంది. అందుకని, ఈ నెలలో జీతాలు ఎలా చెల్లించాలి అని చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు పొరుగునున్న తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. తెలుగునాట బడా నిర్మాత చేతిలో కొన్ని థియేటర్లు ఉన్నాయ్. వాళ్లు సినిమాలలో చాలా వరకు పెట్టుబడులు పెట్టారు. మళ్లీ థియేటర్లు తెరచుకుని ఆ సినిమాలు విడుదల అయితేనే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. అటు సినిమాల నుండి ఆదాయం లేదు... ఇటు థియేటర్ల నుండి ఆదాయం లేదు. ఈ నష్టాలను ఎలా భరించాలో అని వాళ్లు అలోచనలో పడ్డారు.
![]() |
![]() |