![]() |
![]() |

'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత పరశురామ్ డైరెక్షన్‌లో నటించాలని మహేశ్ డిసైడ్ చేసుకున్నాడు. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ మూవీ ప్రారంభం కానున్నది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా 'మహానటి' ఫేమ్ కీర్తి సురేశ్ పేరు బలంగా వినిపిస్తుండగా, లేటెస్ట్‌గా బాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరైన, ప్రభాస్ జోడీగా 'సాహో'లో నటించిన శ్రద్ధా కపూర్ పేరు తెరపైకి వచ్చింది. మహేశ్ సూచన మేరకు శ్రద్ధను పరశురామ్ సంప్రదించాడనీ, ఆమె నటించడం ఖాయమంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం మొదలైంది.
అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకూ ఏ హీరోయిన్ కూడా ఈ సినిమా కోసం సంతకం చేయలేదని అవి చెప్పాయి. కాకపోతే మహేశ్‌తో కీర్తి నటించే అవకాశాలు ఉన్నాయనే విషయం ప్రచారంలోకి వచ్చినప్పుడు మహేశ్ ఫ్యాన్స్ నుంచి సానుకూల స్పందన వచ్చిందనీ, ఆ జోడీ తెరపై సూపర్‌గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైందనీ ఆ వర్గాలు అంటున్నాయి. అందువల్ల కీర్తికే ఈ సినిమాలో ఎక్కువ చాన్స్ ఉందని చెప్పాలి.
![]() |
![]() |