![]() |
![]() |

బెంగళూరుకు చెందిన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్... బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు, హీరోయిన్ అతియా శెట్టి ప్రేమలో ఉన్నారని ముంబై మీడియా ఎప్పటినుండో కోడై కూస్తోంది. మొదట మంచి స్నేహితులుగా ప్రారంభమైన వీరి ప్రయాణం... చివరకు ప్రేమ తీరాన్ని చేరింది. అయితే... వీరిద్దరూ ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ చెప్పలేదు. అలాగని... ప్రేమపై వస్తున్న వార్తలను ఖండించనూ లేదు. కానీ... వీలు చిక్కినప్పుడల్లా ముంబైలో షికార్లు కొట్టారు. సోషల్ మీడియా వీరి ప్రేమను అందరికీ తెలిసేలా చేసింది. వీరి ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది.
లాక్ డౌన్ వల్ల బెంగళూరులో రాహుల్.... ముంబైలో అతియా శెట్టి ఉండిపోవాల్సివచ్చింది. ఇద్దరూ వేరువేరు నగరాల్లో ఉండగానే కేఎల్ రాహుల్ పుట్టిన రోజు వచ్చింది. శనివారం రాహుల్ బర్త్ డే. ఈ సందర్భంగా అతియా శెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అది రాహుల్, తాను కలిసి ఉన్న ఫోటో! 'హ్యాపీ బర్త్ డే మై పర్సన్' అని ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'రాహుల్ నా వాడు' అని పబ్లిక్ గా ప్రకటించారు. దాంతో నిన్నటి వరకు వీరి ప్రేమ గురించి సందేహాలు ఉన్న వారికి సైతం ఒక స్పష్టత వచ్చింది. అంతేకాదు... శనివారం రాత్రి 'ఇప్పుడు ప్రపంచమంతా ప్రేమ గురించి తెలిసే ఉంటుంది' అని మరో పోస్ట్ చేశారు అతియా శెట్టి. అదీ సంగతి!!
![]() |
![]() |