![]() |
![]() |

కరోనా ఎఫెక్ట్‌పై కొందరు సినిమాలు ప్రకటించారు. హిందీలో 'కరోనా ప్యార్ హై', కన్నడలో 'కరోనా' (హిందీలో 'డెడ్లీ కరోనా'గా డబ్బింగ్ చేయాలనుకుంటున్నారు) స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత షూటింగులు స్టార్ట్ చేయాలనుకున్నారు. సస్పెన్స్ డ్రామాగా కెనడియన్-పర్షియన్ ఫిలింమేకర్ ముస్తఫా 'కరోనా' సినిమా తీశారు. 'ఫియర్ ఈజ్ ది వైరస్' (భయమే ఒక వైరస్) అని క్యాప్షన్‌తో ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇవన్నీ ఒక కేటగిరీ... తమిళంలో కొత్త దర్శకుడు ఏయం విజయ్ భాస్కర్ రాజ్ అనౌన్స్ చేసిన '21 డేస్' నెక్స్ట్ కేటగిరీ.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా మీద చాలామంది సినిమాలు ప్రకటించారు. అయితే... లాక్‌డౌన్‌పై విజయ్ భాస్కర్ సినిమా అనౌన్స్ చేశాడు. లాక్‌డౌన్‌లో ఆంక్షలు విధించిన తర్వాత తమ సొంతూరు వెళ్లలేక ఇబ్బందులు పడిన ఇద్దరు కాలేజీ విద్యార్థుల నేపథ్యంలో అతడు కథ రాశాడట. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టు విజయ్ భాస్కర్ తెలిపాడు. హిందీ, తెలుగు భాషల్లోనూ సినిమా తీస్తానని అతడు చెబుతున్నాడు. టైటిల్ కింద తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్నట్టు తెలిపాడు.
![]() |
![]() |