![]() |
![]() |

కన్నడ హీరో నిఖిల్ గుర్తున్నాడా? తెలుగులో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన కథతో 'జాగ్వార్' చేశాడు. ఇతడు మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు. ఏప్రిల్ 17న (రేపే) నిఖిల్ కుమార్ గౌడ ఏడడుగులు వేయనున్నాడు. జనవరిలో కర్ణాటక మాజీ మంత్రి కృష్ణప్ప మేనల్లుడి కుమార్తె రేవతితో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధమే ఇది. రాజకీయ, సినిమా రంగానికి చెందిన పలువురు అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేయాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టు పెళ్లి ప్లానింగ్, ఏర్పాట్లు రెండు నెలల క్రితమే ప్రారంభించారట.
ఉన్నట్టుండి కరోనా వచ్చి పడటంతో ప్లాన్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. అయితే, పెళ్లిని వాయిదా వేయడానికి దేవెగౌడ కుటుంబం ఇష్టపడలేదు. అందుకని, కర్ణాటకలోని రమణగారలోని తమ ఫామ్‌హౌస్‌లో నిఖిల్ పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. వధూవరుల కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారని సమాచారం.
తెలుగు హీరోల విషయానికి వస్తే... ఈ రోజు దుబాయ్‌లో షాలినితో నితిన్, హైదరాబాద్‌లో పల్లవి వర్మతో నిఖిల్ ఏడడుగులు వేయాలి. కరోనా కారణంగా ఇద్దరూ తమ తమ పెళ్లిని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |