![]() |
![]() |

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఒకసారి వెనక్కి తీసుకువెళ్లాడు. కరోనా కల్లోలం కలకలం సృష్టించిన నేపథ్యంలో మరోసారి వెనక్కి తీసుకువెళతాడా? ఫిలింనగర్ ప్రముఖుల్లో సందేహాలు, గుసగుసలు ఎన్నో. అసలు, ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. వివిధ కారణాల వలన వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదలను వాయిదా వేశారు. వివిధ కారణాల్లో ముఖ్యమైనది షూటింగ్ సకాలంలో పూర్తి కాదు కాబట్టి. ఇప్పుడు కరోనా వల్ల అనుకున్నట్టు షూటింగ్ జరగడం లేదు. అందువల్ల, వచ్చే ఏడాది జనవరి 8న కాకుండా ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటున్నట్టు కొంతమంది వార్తలు రాశారు.
ఏప్రిల్ 28న అని గట్టిగా నొక్కి వక్కాణించడానికి కారణం ఏంటంటే... రాజమౌళి బ్రాండ్ మరింత చాటిచెప్పిన, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు తన పేరిట లిఖించుకున్న 'బాహుబలి 2' ఆ రోజే విడుదలైంది. అసలు మేటర్ ఏంటంటే... ఏప్రిల్ 28న 'ఆర్ఆర్ఆర్' రావడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. ఆల్రెడీ 80 పర్సంట్ షూటింగ్ కంప్లీట్ అయిందట. వీఎఫ్ఎక్స్, సీజీకి అవసరమైన షాట్స్ ముందే తీసి విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలకు పంపించారట. ఒక్కసారి లాక్ డౌన్ ముగిసిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకుని మిగతా 20 పర్సంట్ షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి సినిమా తీసుకొస్తామని 'ఆర్ఆర్ఆర్' యూనిట్ వర్గాలు సన్నిహితులతో స్పష్టం చేశాయట.
![]() |
![]() |