Home  »  News  »  డైరెక్టుగా ఓటీటీలో నవీన్ చంద్ర సినిమా

Updated : Apr 13, 2020

 

లో బడ్జెట్ సినిమాలకు ఇప్పుడు ఓటీటీ బంగారు బాతులా మారింది. థియేటర్లలో సినిమా విడుదల చేస్తే ఎంత కలెక్షన్ వస్తుందో చెప్పలేం. అదే ఓటీటీకి ఇస్తే ముందు డబ్బులు వస్తాయి. అందుకని, ఓటీటీకి సినిమాలు అమ్ముతున్నారు. రీసెంట్‌గా నవీన్ చంద్ర హీరోగా నటించిన 'భానుమతి రామకృష్ణ' సినిమాను ముంబైకి చెందిన ఫిల్మీ కార్వాన్ కొనేసిందని టాక్. ఆల్రెడీ నిర్మాతలతో డీల్ సెట్ అయిందట.  హాట్‌స్టార్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. యాక్చువల్లీ... లాస్ట్ ఇయర్ ఆ సినిమా షూటింగ్, డబ్బింగ్ కంప్లీట్ అయ్యాయి. థియేటర్లలో రిలీజ్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు ఓటీటీకి అమ్మేశారు.

ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్లు క్లోజ్ కావడంతో ఓటీటీ నుండి సినిమాలకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే... ఇరవై, ముప్పై కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమాల నిర్మాతలు, హీరోలు ఓటీటీ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే ధోరణిలో ఉన్నారు. చిన్న సినిమాలు మాత్రమే అమ్మేస్తున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన 'రెడ్' సినిమాను అభిమానులు, ప్రేక్షకులకు థియేటర్లలో చూపిస్తానని స్పష్టం చేశారు. 'రెడ్'కి ఓటీటీ నుండి మంచి ఆఫర్ రావడంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక డైలామాలో ఉన్నాడని కామెంట్ చేస్తే క్లారిటీ ఇచ్చాడు. నాని విలన్‌గా, సుధీర్‌బాబు హీరోగా 'దిల్' రాజు నిర్మించిన 'వి' సినిమాకి సైతం ఓటీటీ నుండి మంచి ఆఫర్ వచ్చింది. అయితే, ఆయన ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.