![]() |
![]() |

లాక్‌డౌన్ పీరియడ్‌లో పాయల్ రాజ్‌పుత్ తెలుగు నేర్చుకుంటున్నారు. అదొక్కటే చేస్తున్నారని అనుకోవద్దు. ఇంటి పని, వంట పని కూడా ఆవిడే చేసుకుంటున్నారు. తప్పదు మరి, లాక్‌డౌన్ వల్ల పాయల్ ఇంటికి పనిమనిషి రావడం లేదు. ఫ్యామిలీ ఏమో ఢిల్లీలో ఉంది. ముంబైలో 'ఆర్ఎక్స్ 100' ముద్దుగుమ్మ చిక్కుకు పోయింది. అందువల్ల ఇల్లు తుడవడం, తడిగుడ్డ పెట్టడం, వంట వండడం వంటి పనులన్నీ పాయల్ చేసుకుంటున్నారు. మధ్యలో టిక్ టాక్ వీడియోస్ చేయడం, సినిమాలు చూడడం వంటివి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నప్పటికీ పనులు చేసుకోవడం తప్పడం లేదు. దాంతో 'నేను నా పనిమనిషిని చాలా మిస్ అవుతున్నా' అని పాయల్ తెగ బాధపడుతున్నారు.
తెలంగాణ సహా ప్రస్తుతం పాయల్ ఉంటున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ విధించారు. అప్పటివరకు ఆమె సొంత పనులు చేసుకోవాల్సిందే. ఇక, సినిమాల విషయానికి వస్తే పాయల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న '5Ws' షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒక షెడ్యూల్ బ్యాలన్స్ ఉందట. కరోనా లేకపోతే థియేటర్లలోకి వచ్చేది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసి, రిలీజ్ చేయాలనుకుంటున్నారు.


![]() |
![]() |