![]() |
![]() |

ఈరోజు బైసాఖి లేదా వైసాఖి.. తెలుగు వాళ్లకు ఉగాది ఎలాగో సిక్కులకు బైసాఖి అలాగ. ఈ పండగను పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సంబరంగా జరుపుకుంటారు. గురుద్వారాలను అలంకరించి, కీర్తనలను ఆలపిస్తారు. ప్రధానంగా పంజాబ్ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి రబీ పంట కోతకు ముందు దేవతలను రైతులు ఆరాధించడం వల్ల ఈ రోజుకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇదంతా చెప్పడం ఎందుకంటే బైసాఖి సందర్భంగా పంజాబీ సుందరి మెహ్రీన్ కౌర్ పిర్జాడా తనవాళ్లకు సోమవారం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తను బైసాఖి జరుపుకున్న ఫొటోను షేర్ చేసుకున్న ఆమె, "మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలనీ, అది వెలుగుతో నిండిపోవాలని కోరుకుంటున్నా. వాహేగురు (సిక్కుల ఆరాధ్యగురు)కు కృతజ్ఞతలు తెలపడం మరచిపోకండి. ప్రేమ, నవ్వు అనే మంత్రాన్ని అనుసరించడానికి బైసాఖి అనేది నా మేలుకొలుపు పిలుపు" అని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మనమూ మెహ్రీన్‌కు బైసాఖి శుభాకాంక్షలు తెలియజేద్దాం. కెరీర్ విషయానికి వస్తే తెలుగులో 'అశ్వత్థామ' మూవీ తర్వాత ఇంతవరకూ మరో సినిమాకు ఆమె సంతకం చేసిన దాఖలాలు లేవు. ఈ సంవత్సరం ఆమె కెరీర్ దూసుకుపోతుందేమో చూడాలి.

![]() |
![]() |