![]() |
![]() |

'హిట్: ది ఫస్ట్ కేస్'లో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ హీరో కనిపిస్తాడు. ఆ మాటకొస్తే... ప్రతి సినిమాలో హీరోనే ఎక్కువసేపు కనిపిస్తాడు. హీరోయిన్ రోల్ తక్కువే ఉంటుంది. 'హిట్' విషయానికి వస్తే... హీరోయిన్ రుహాని శర్మ పాత్ర నిడివి కంటే హీరో విశ్వక్ సేన్ పక్కన ఉండే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చైతన్య సాగిరాజు (రోహిత్ పాత్ర పోషించాడు) పాత్ర నిడివి ఎక్కువ. ఒక పాట, నాలుగు ఐదు సన్నివేశాలకు మాత్రమే రుహాని పాత్ర పరిమితమైంది. 'హిట్' సీక్వెల్‌లో ఆమె పాత్ర అలా ఉండదట.
"హిట్: ది సెకండ్ కేస్'లో హీరోయిన్ రుహాని శర్మ పాత్ర తప్పకుండా ఉంటుంది. దాదాపుగా ప్రతి సన్నివేశంలో ఉంటుంది" అని దర్శకుడు శైలేష్ కొలను తెలిపాడు. సీక్వెల్‌లోనూ 'హిట్: ది ఫస్ట్ కేస్'లో కథానాయికగా నటించిన రుహానీ శర్మను తీసుకుంటున్నట్టు అతడు స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది. హీరోగా విశ్వక్ సేన్‌కి పేరు, నిర్మాతగా నానికి 'హిట్' లాభాలు తీసుకొచ్చింది. దర్శకుడిగా పరిచయమైన శైలేష్ కొలను తనలో ప్రతిభ ఉందని నిరూపించుకున్నాడు. అయితే... తెలుగులో సీక్వెల్స్ హిట్ అయిన దాఖలాలు తక్కువ. 'హిట్ 2' ఏమవుతుందో చూడాలి.
![]() |
![]() |