![]() |
![]() |

'కోర్ట్' మూవీతో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ శ్రీదేవి. ప్రీవియస్ మూవీ బ్యాండ్ మేళం తో కూడా సత్తా చాటిన శ్రీదేవి ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.తాజాగా డిజిటల్ మోసంపై స్పందిస్తూ తన అభిమానులని. నెటిజన్లని అప్రమత్తం చేసింది.
సోషల్ మీడియా ప్రపంచంలో తన పేరుతో జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలు మరియు డిజిటల్ అవకతవకలపై శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కీలకమైన ప్రకటనని విడుదల చేశారు. కొంతమంది కేటుగాళ్లు నా అనుమతి లేకుండా, నాపేరు, ఫొటోలు, గుర్తింపుని అక్రమంగా వాడుకుంటూ కొన్ని నకిలీ యూట్యూబ్ ఛానెళ్ల ని నడుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ మోసగించే ప్రమాదం ఉంది. ఆ యూట్యూబ్ ఛానెళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.ఎవరైనా సరే యూట్యూబ్‌లో తన పేరుతో ఉన్న ఛానెళ్లని చూస్తే, వాటిని తన అధికారిక ఛానెళ్లుగా భావించి మోసపోవద్దు. అవన్నీ నూటికి నూరు శాతం నకిలీవి. ఎలాంటి వివరాలైన నా ఇనిస్టా పేజీ నుంచి వచ్చాయని తెలిపింది.
also read: Mohanlal: క్షమాబిక్ష పథకంలో మోహన్ లాల్ పేరు..ఇక కథ ముగిసినట్టేనా!
![]() |
![]() |