![]() |
![]() |

మలయాళ మెగాస్టార్ అనే టాగ్ లైన్ కి తగ్గట్టుగానే యువ హీరోలకి పోటీ ఇస్తూ మోహన్ లాల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 14 ఏళ్లుగా మోహన్ లాల్ పై ఉన్న ఏనుగు దంతాల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మోహన్ లాల్ కేరళ అటవీ శాఖ ప్రవేశపెట్టిన వన్ టైమ్ క్షమాభిక్ష పథకంని ఆశ్రయించారు. ఈ ప్రత్యేక పథకం ద్వారా తన వద్ద ఉన్న వన్యప్రాణి వస్తువులను అధికారికంగా ప్రకటించి, చట్టపరమైన రక్షణ పొందాలని ఆయన భావిస్తున్నారు.
ఈ వివాదం 2011 డిసెంబర్ 21న ప్రారంభమైంది. ఆ సమయంలో కొచ్చిలోని థేవరాలో ఉన్న మోహన్‌లాల్ నివాసంపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఊహించని విధంగా 2 జతల ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన 13 విలువైన విగ్రహాలు బయటపడ్డాయి. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం, ముందస్తు అనుమతి లేదా యాజమాన్య పత్రాలు లేకుండా ఇలాంటి వస్తువులని ఉంచుకోవడం తీవ్రమైన నేరం. దీని ఆధారంగా 2012లో కేరళ అటవీ శాఖ మోహన్‌లాల్ మరియు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. అప్పటి నుండి ఈ వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.
also read: Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్న బండ్ల గణేష్
గతంలో ఈ కేసును ఉపసంహరించుకోవాలని కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలని పెరుంబావూర్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో పాటు మోహన్ లాల్ కి అనుకూలంగా ప్రభుత్వం జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలని సైతం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 40(4) ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న ఇలాంటి వస్తువులను స్వచ్ఛందంగా డిక్లేర్ చేయడానికి ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిని బేస్ చేసుకుని కేరళ అటవీ శాఖ ఈ వన్ టైమ్ అమ్నెస్టీ స్కీమ్‌ని తీసుకురావడంతో మోహన్‌లాల్ కొచ్చి నివాసంలో ఉన్న ఏనుగు దంతాలను అటవీ శాఖ అధికారుల వద్ద డిక్లేర్ చేశారు.
![]() |
![]() |