Home  »  News  »  Trisha: త్రిష పోస్ట్ వైరల్.. ఆ విధమైన తపన తగ్గిపోయింది 

Updated : Jul 4, 2026


స్టార్ హీరోయిన్ అనే టాగ్ లైన్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇంకా చాలా టైం ఉందంటూ త్రిష వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కరుప్పు అలియాస్ వీరభద్రుడుతో రీసెంట్ గా భారీ విజయాన్ని అందుకున్న త్రిష త్వరలోనే మెగాస్టార్ తో కలిసి విశ్వంభరతో రాబోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే త్రిష  రీసెంట్ గా  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా చేసిన ఒక సంచలన పోస్ట్ ఇప్పుడు  హాట్ టాపిక్‌గా మారింది. 


 త్రిష ఇటీవల జారా ఆన్‌లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కొన్ని ప్రీమియం దుస్తులని  ఆర్డర్ చేశారు. ఎంతో ఇష్టపడి ఆర్డర్ చేసిన పార్సిల్ ఇంటికి రాగానే ఆమె ఎంతో ఆత్రుతగా ఓపెన్ చేశారు. కానీ, ఆ బాక్స్ ఓపెన్ చేయగానే  తీవ్ర నిరాశ, అసహ్యం కలిగాయి. ఆ దుస్తుల నుంచి భరించలేనంతగా చెమట దుర్వాసన వచ్చింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. వరుసగా ఇది మూడోసారి అంట.అలా ఏకంగా మూడు సార్లు వరుసగా హోమ్ డెలివరీలో ఇలాంటి కంపు కొట్టే బట్టలనే జారా సంస్థ పంపించిందని త్రిష స్వయంగా వెల్లడించారు. సాధారణంగా ఎవరో వాడి రిటర్న్ చేసిన బట్టలను లేదా ట్రయల్ రూమ్‌లలో కస్టమర్లు వేసుకుని వదిలేసిన దుస్తులను సరైన క్వాలిటీ చెక్, వాషింగ్ లేకుండా మళ్లీ ప్యాక్ చేసి కొత్తవాటిలా డెలివరీ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.


Also read: social media influencer: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ దారుణ హత్య 

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సౌత్ క్వీన్ త్రిష.. జారా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌తో పాటు వారి కస్టమర్ కేర్ అకౌంట్‌ ని  కూడా ట్యాగ్ చేస్తూ ఘాటుగా పోస్ట్ పెట్టారు. "డియర్ జారా.. ఇదొక చిన్న విన్నపం మాత్రమే. మేము తదుపరిసారి హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేసినప్పుడైనా బట్టల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోండి. ఇది వరుసగా మూడోసారి ఇలా జరగడం. నిజంగా ఇది చాలా అసహ్యంగా ఉంది. కనీసం కస్టమర్లకు ప్యాక్ చేసి పంపించే ముందైనా ఆ బట్టలు ఎలాంటి వాసన వస్తున్నాయో ఒకసారి స్మెల్ చూసి పంపించండి" అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ వయసులో ఇతరులని మెప్పించాలనే తపన తగ్గిపోయి, ఎవరి గురించి పట్టించుకోని స్ట్రాంగ్ ఆటిట్యూడ్ (IDGAF attitude) వస్తుందంటూ పెరిమెనోపాజ్ గురించి ఒక డాక్టర్ చెప్పిన కోట్‌ ని  కూడా ఆమె షేర్ చేస్తూ.. దానికి 'ఫ్యాక్ట్' అని క్యాప్షన్ ఇచ్చింది.

 Trisha fires on zara brand apparel issue post, trisha latest post, Trisha latest news, karuppu, vishwambhara, chiranjeevi






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.