Home  »  News  »  తిరుపతిలో 'లెనిన్' గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

Updated : Jul 4, 2026

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (LENIN) సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ రేపు అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది. 

తిరుపతిలోని ప్రముఖ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ ఈ ఈవెంట్ కు వేదిక కానుంది. రేపు సాయంత్రం 5:00 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అక్కినేని నాగార్జునతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మాస్ యాక్షన్ డ్రామాను మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అఖిల్ నటనను సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఆయన ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

'లెనిన్' మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూలై 10 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో రేపు సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించబోయే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను మరింత స్కై హైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల్ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ మాస్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

https://x.com/AnnapurnaStdios/status/2073285993197879368






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.