![]() |
![]() |

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన 'కాంతార' చిత్రం 2022లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1' వస్తుంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ.. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాంతార ప్రీక్వెల్ కావడంతో ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకేనేమో మేకర్స్ ఇప్పటిదాకా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయితే విడుదలకు ఇంకా పది రోజులే ఉండటంతో.. తాజాగా ట్రైలర్ ను విడుదల చేసి, గ్రాండ్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. (Kantara Chapter 1)
దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందిన 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. కంటెంట్ పరంగా, విజువల్స్ పరంగా మొదటి భాగాన్ని మించి ఎన్నో రెట్లు గొప్పగా కనిపిస్తోంది. ట్రైలర్ తోనే ప్రేక్షకులను కాంతార ప్రపంచంలోకి తీసుకెళ్ళారు. కాంతార సెటప్, అందులోని పాత్రలను మలిచిన తీరు, వారి వస్త్రధారణ ప్రతిదీ ఆకట్టుకుంటున్నాయి. బలమైన ఎమోషన్స్, కట్టిపడేసే యాక్షన్ సీన్స్ తో వెండితెరపై ఓ విజువల్ వండర్ ను చూడబోతున్నామనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగిస్తోంది. రిషబ్ శెట్టి మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా లాస్ట్ షాట్ లో ఆయన కనిపించిన తీరు ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ధరణి ఆర్ట్ వర్క్ గా ట్రైలర్ కు ప్రధాన బలాలుగా నిలిచాయి.
కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పటిదాకా 'కేజీఎఫ్-2' మాత్రమే రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ చూస్తుంటే.. కన్నడ ఇండస్ట్రీ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా పడినట్లే అనిపిస్తోంది.
![]() |
![]() |