![]() |
![]() |

సీనియర్ నటీమణి 'రాధిక'(Radhika)గురించి తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు లేడు. ఆమె కోసమే దర్శక, రచయితలు క్యారక్టర్ ని సృషించారా, అనేలా తన నట ప్రస్థానం కొనసాగింది. తెలుగులో దాదాపుగా అందరి అగ్ర హీరోల సరసన నటించి, తెలుగు సినిమా చరిత్రలో తన కంటు ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకుంది. గత నెలలో 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' లో సంగీత విధ్వంసురాలి క్యారక్టర్ లో చేసి తన సత్తా చాటిన రాధిక, టెలివిజన్ రంగంలోను తన కంటు బ్రాండ్ సృష్టించుకుంది.
నిన్న రాధిక తల్లి 'గీతా రాధా'(Geetha Radha)చనిపోయారు.ఈ విషయాన్ని మీడియా ద్వారా రాధిక తెలియచేసింది. గీతారాధా వయసు ఎనభై ఆరు సంవత్సరాలు కాగా, వృద్దాప్య సమస్యలు తలెత్తడంతోనే ఆమె తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్ధం భౌతిక దేహాన్ని రాధిక నివాసముంటున్న 'పోయస్ గార్డెన్' లో ఉంచడంతో పాటు. బీసెంట్ నగర్ లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడి చేసారు. శ్రీలంక కి చెందిన 'గీతా రాధా' కొన్ని చిత్రాల్లో కూడా నటించడం జరిగింది.
గీతా రాధా భర్త, రాధిక తండ్రి 'ఎం ఆర్ రాధా' తెలుగు వ్యక్తి. తమిళ చిత్ర పరిశమ్రలో అనేక చిత్రాల్లో హీరోగా చేసి తన సత్తా చాటాడు. పొలిటీషియన్ గాను తమిళ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గీతా రాధా ఆయనకి మూడో భార్య. రాధిక పెద్ద కూతురు కాగా మరో హీరోయిన్ నిరోషా(Nirosha)రెండో కూతురు.

![]() |
![]() |