![]() |
![]() |

కొన్ని కాంబినేషన్స్ గురించి చిన్న న్యూస్ వచ్చినా చాలు, సిల్వర్ స్క్రీన్ పై ఆ కాంబోని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాంటి ఒక కాంబినేషనే విజయ్ దేవరకొండ(Vijay deverakonda)డాక్టర్ రాజశేఖర్(Rajashekar).సినిమాల పరంగా ఈ ఇద్దరి మధ్య వ్యతాసం ఉన్నా, విభిన్న నటనకి ఆ ఇద్దరు కేర్ ఆఫ్ అడ్రస్స్. ఇప్పుడు ఈ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటించబోతున్నారనే వార్తలు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ లిస్ట్ లో నూతన దర్శకుడు 'రవికాంత్'(Ravikanth)తెరకెక్కిస్తున్న 'రౌడీ జనార్దన్'(Rowdy Janardhan)ఒకటి. ఈ మూవీలో రాజశేఖర్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. రాజశేఖర్ హీరో నుంచి విలన్ గా చెయ్యడానికి ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు హీరోగా మెప్పించిన రాజశేఖర్, విలన్ గా ఎలా మెప్పిస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది. ఇక ఈ చిత్రం నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ కి వెళ్ళబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ 2023 లో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్'లో కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. .
అగ్ర నిర్మాత 'దిల్ రాజు'(Dil Raju)రౌడీ జనార్దన్ ని ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని నిర్మించబోతున్నాడు. విజయ్ గత జులై 31 న 'కింగ్ డమ్' తో ప్రేక్షకుల ముందుకు రాగా, పెర్ ఫార్మెన్స్ పరంగా విజయ్ కి మంచి పేరే వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పరాజయాన్ని అందుకొని . దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. రౌడీ జనార్దన్ తో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా చేస్తున్నాడు. ఈ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉంది.
![]() |
![]() |