![]() |
![]() |

విభిన్న చిత్రాల దర్శకుడు 'వెట్రిమారన్'(Vetrimaaran),మరో విభిన్న దర్శకుడు 'అనురాగ్ కశ్యప్'(Anurag Kashyap)సంయుక్తంగా నిర్మించిన తమిళ చిత్రం 'బ్యాడ్ గర్ల్'(Bad Girl).మహిళా దర్శకురాలు 'వర్ష భరత్'(Varsha Bharath)తెరకెక్కించింది. రమ్య అనే యువతీ స్కూల్ వయసు నుంచే తనకి నచ్చిన జీవిత భాగస్వామిని కనుగొనే ప్రాసెస్ లో కొంత మంది అబ్బాయిలతో డేటింగ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో రమ్యకి కుటుంబ సభ్యులతో పాటు,సమాజం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే అంశాలతో 'బ్యాడ్ గర్ల్' తెరకెక్కింది. టీజర్ రిలీజ్ అయినప్పట్నుంచే అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం చెప్పడంతో,యూనిట్ సభ్యులు 'కోర్ట్' మెట్లు కూడా ఎక్కారు. సుదీర్ఘ విచారణ తర్వాత, చివరకి కొన్ని కట్స్ తో ఈ నెల 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రీసెంట్ గా ఈ చిత్రం గురించి వర్ష భరత్ మాట్లాడుతు 'బ్యాడ్ గర్ల్ తో నేనేదో అశ్లీల చిత్రం తీశానని లోకల్ వారందరు నిందించారు. కానీ టీజర్ రిలీజ్ రోజే 'అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డ్యామ్' లో ప్రదర్శిస్తే అక్కడి వారంతా మంచి చిత్రం తెరకెక్కించావని అభినందించారు. అంతర్జాతీయ ప్రేక్షకులు అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులకి తమిళంలో కావడం, రివ్యూలు చూసాక మనసు కుదుటపడింది. థియేటర్ లో విడుదలైన వారం తర్వాత నా కుటుంబ సభ్యుల్ని తీసుకొని వెళ్ళాను. వాళ్ళు నన్నేమి విమర్శించలేదు. దీంతో సినిమా విషయంలో దైర్యం వచ్చిందని వర్ష భరత్ చెప్పుకొచ్చింది.
'బ్యాడ్ గర్ల్' లో రమ్యగా 'అంజలి శివరామన్'(Anjali Sivaraman)పలు రకాల పార్శ్యాలు ఉన్న క్యారక్టర్ లో అద్భుతంగా చేసింది. రమ్య తల్లి సుందరిగా సీనియర్ నటీమణి శాంతి ప్రియ, మిగతా క్యారక్టర్ లలో శరణ్య రవిచంద్రన్, హ్రిదు హరూన్, తేజాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిందీ చిత్ర సీమకి చెందిన లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ 'అమిత్ త్రివేది'(Amit Trivedi) అందించిన సంగీతం ప్లస్ పాయింట్ గా నిలిచింది.

![]() |
![]() |